జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ రాజీనామా..
జగిత్యాల (CLiC2NEWS): పురపాలక ఛైర్పర్సన్ బోగ శ్రావణి పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఆమె మీడియాతో సమావేశంలో.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వేధింపులు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దొర అహంకారంతో బిసిల ఎదుగుదలను ఓర్వలేక కక్షగట్టారన్నారు. మాకుంటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పిని కోరినట్లు మీడియా ముందు తెలిపారు. ఎమ్మెల్యే అన్ని పనులకు అడ్డు వస్తున్నారని.. నడిరోడ్డుపై అందరిముందూ అవమానాలకు గురిచేస్తున్నారు. పిల్లలున్నారు, వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరిస్తున్నట్లు కన్నీటిపర్యంతమైయ్యారు. ఏ ఒక్క పనికూడా నాచేతులతో ప్రారంభించకూడదని, జిల్లా కలెక్టర్‌ని కలవొద్దని ఆదేశించారన్నారు. పేరుకే నేను మున్సిపల్ ఛైర్మన్‌ని, పెత్తనం అంతా ఆయనదే అని శ్రావణి మీడియాకు తెలిపారు.