ఆన్‌లైన్ గేమ్‌ల ఆట‌క‌ట్టించిన‌ సైబ‌రాబాద్ పోలీసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆన్‌లైన్ గేమ్‌ల‌తో మోసాల‌కు పాల్ప‌డుతున్న అంత‌ర్జాతీయ ముఠాను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ గేమ్‌ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీగా సొమ్మును దోచేస్తున్న ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరు గ‌తంలో న‌కిలీ కాల్సెంట‌ర్లో టెలీకాల‌ర్లుగా ప‌నిచేశారు. వీరిని విదేశాల‌కు చెందిన కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు క‌మిష‌న్ ఆశ చూపి ఈ ఆన్‌లైన్ గేమ్ దందా ప్రారంభించిన‌ట్లు తెలుస్తుంది.

మోహిన్‌పాషా, హ‌వ‌ల్దాని, క‌ర‌ణ్ మ‌ల్హోత్రా, సోనూలోకేశ్‌, మోహిత్ కుమార్, దినేశ్ సింగ్‌, క‌ర‌ణ్ ఆరోరా, సంజీవ్ కుమార్ గోకుల్ సింగ్ కోరంగాలు ఈ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు గుర్తించారు.
మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి భారీ మొత్తంలో న‌గ‌దును జ‌ప్తు చేశారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ. 41 కోట్లు జ‌ప్తు చేశారు. 193 ఫోన్లు, 21 ల్యాప్‌టాప్‌లు, 21 పిఒఎస్ యంత్రాలు, 416 చెక్‌బుక్‌లు, 233 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.