పాక్ మాజీ అధ్యక్షుడు ముషార‌ఫ్ క‌న్నుమూత‌

దుబాయ్ (CLiC2NEWS): పాక్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్ క‌న్నుమూసిన‌ట్లు ఆ దేశ న్యూస్ చానెల్స్ క‌థ‌నాలు వెలువ‌రిస్తున్నాయి. దుబాయ్‌లోని అమెరికా అసుప‌త్రిలో కొంత కాలంగా చికిత్స పొందుతూ ముషార‌ఫ్ క‌న్నుమూసిన‌ట్లు.. ఈమేర‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ధ్రువీక‌రించిన‌ట్లు పాక్‌కు చెందిన జియో న్యూస్ వెల్ల‌డించింది.
1943 ఆగ‌స్టు 11న ఢిల్లీలో జ‌న్మించిన ముషార‌ఫ్ దేశ విభ‌జ‌న త‌ర్వాత కుటుంబంతో క‌లిసి పాక్‌కు వెళ్లిపోయింది. సైన్యంలో చేరిన ముషార‌ఫ్ ఆదేశాధ్యుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008 వ‌ర‌కు పాక్ దేశాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. కార్గిల్ యుద్ధానికి ముషార‌ఫ్ ప్ర‌ధాన కార‌కుడు. అమైలాయిడోసిస్ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొంత కాలంగా దుబాయ్‌లో చికిత్స పొందుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.