తిరుమల ఘట్‌రోడ్డులో ప్రమాదానికి గురైన కారు.. ఆరుగురికి గాయాలు
తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 33వ మలుపు వద్ద కారు అదుపుత్పి రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘాట్‌రోడ్డు పక్కన లోతు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.