అంగవైక‌ల్యం ఉన్న వారిగా వ‌చ్చి.. కొల్ల‌గొట్టి పోతారు

జీడిమెట్ల (CLiC2NEWS): ఏదో ఒక అంగ‌వైక‌ల్యం ఉంద‌ని చెప్పి.. విలువైన వ‌స్తువులు చోరీ చేసే ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు తెల‌పిన వివ‌రాల ప్ర‌కారం..
చెవిటి, మూగ వాళ్ల‌మ‌ని చెప్పి.. రైళ్లు, బ‌స్సులు, నివాస ప్రాంతాల‌కు వ‌చ్చి సాయం చేయ‌మంటూ అడుగుతారు. ఎటువంటి అనుమానం రాకుండా ప్ర‌వ‌ర్తించి.. విలువైన వ‌స్తువులు కొట్టేసి ప‌రార‌వుతారు. న‌గ‌రంలోని ప‌ఠాన్ చెరులో ఉంటూ.. కూక‌ట్‌ప‌ల్లి, కెపిహెచ్‌బి, మియాపూర్‌, మాదాపూర్‌, గ‌చ్చిబౌలి త‌దిత‌ర ప్రాంతాల్లోని ప్రైవేటు వ‌స‌తి గృహాలు, బ్యాఇల‌ర్ గ‌దుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తారు. మూగ‌, చెవిటి వాళ్ల‌లా న‌టిస్తూ.. క‌ర‌ప‌త్రాలు చూపి సాయం అడుగుతారు. ఎవ‌రూ లేర‌ని నిర్ధార‌ణ చేసుకున్న త‌ర్వాత వారి వ‌ద్ద ఉన్న వ‌స్తువులు మాయం చేస్తారు. ఆ వ‌స్తువుల‌ను త‌మిళ‌నాడులో విక్ర‌యించి సొమ్ము చేసుకునే త‌మిళ‌నాడుకు చెందిన దొంగ‌ల ముఠాను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుండి రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దు, 3 ల్యాప్‌ట‌ప్‌లు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠాకు చెంద‌ని ఒక‌రిని గతంలో పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు ఎంత ప్ర‌శ్నించినా మూగ‌, చెవుడున్న వ్య‌క్తిలా న‌టించి.. నోరు మెద‌ప‌లేదు. సైగ‌ల‌తో త‌న‌కేమీ తెల‌వ‌ద‌ని బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే అత‌నిపై నిఘా పెట్టిన పోలీసులు.. అత‌నిని గ‌మ‌నిస్తూ ఉన్నారు. రైల్వే స్టేష‌న్‌లో గ‌ర్ల్‌ప్రెండ్‌తో ఫోన్ మాట్లాడుతుండ‌గా పోలీసులు గ‌మ‌నించి.. వీడియో రికార్డ్ చేశారు. వెంట‌నే అత‌నిని అదుపులోకి తీసుకొని విచారించ‌గా.. నిజం ఒప్పుకున్నాడు. అత‌నిచ్చిన స‌మాచారంతో మిగతావారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.