మంచిర్యాల: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
జైపూర్ (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెంకడరీ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో సమ్మేళనం అయ్యారు. 23 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో చదివిన రోజులను వారంతా గుర్తు చేసుకొన్నారు. ఒకరికొకరు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమకు చదువు చెప్పిన గురువులు శకంర్ రావు, ప్రకాశ్ రావు, సురేష్, దివాకర్ రెడ్డి, మారుతిరావు, దత్త కుమార్, శ్రీదేవి, జ్ఞానలీలా, ప్రమీళారాణి లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా 1999-2000 వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయులుగా చేసిన కీ.శే.నర్సింహారెడ్డి సతీమణి మధురవాణి ముఖ్య అతితిగా పాల్గొన్నారు.
అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సమ్మేళనం గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్కరికి మెమొంటో అందించారు. తాము చదివిన పాఠశాలకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు

