హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జిఓ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 12 ఎసిపి డివిజన్లు.. సైబరాబాద్‌లో 3 డిసిపి జోన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఆరుగురు డిసిపిలను నియమించనున్నారు. ప్రతి జోన్‌కు మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలాగే 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌లో మేడ్చల్, రాజేంద్రనగర్, రాచకొండలో మహేశ్వరం జోన్లు ఏర్పాటు కానున్నాయి.
హైదరాబాద్‌లో సెక్రటేరియట్, దోమలగూడ, వారాసి గూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, మసబ్ ట్యాంక్, బోరబండ, సైబరాబాద్, మధురానగర్, ఫిలింనగర్ మాసబ్ ట్యాంక్, మోకిల్లా, అల్లపూర్, సూరారం, కొల్లూరు వ్యాలీ పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ప్రతి ఏరియాలో సైబర్ క్రైమ్, నార్కొటిక్ వింగ్ ఏర్పాటు చేయనున్నారు.