రేష‌న్ డీల‌ర్‌షిప్ అర్హ‌త వ‌య‌స్సు పెంపు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని రేష‌న్ డీల‌ర్ల‌కు సంబంధించిన మ‌రో స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించింది. కారుణ్య నియామ‌కం ద్వారా డీల‌ర్ షిప్ పొందే వారి వ‌యో ప‌రిమితిని పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యంతీసుకుంది. ప్ర‌స్తుతం 40 ఏళ్ల వ‌ర‌కు ఉన్న వ‌యోప‌రిమితిని 50 ఏళ్ల‌కు పెంచింది. ఈ మేర‌కు రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఎవ‌రైన్ రేష‌న్ డీల‌ర్ చ‌నిపోతే.. కారుణ్య నియామ‌కం ద్వారా కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి డీల‌ర్ షిప్ ఇచ్చేందుకు వ‌య‌స్సు ప‌రిమితిని 50 ఏళ్ల వ‌ర‌కు పొడిగించింది. అయితే డీల‌ర్ షిప్ పొందే స‌ద‌రు వ్య‌క్తికి 18 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఈ నిబంధ‌న నుండి మిన‌హాయింపు కోరే అవ‌కాశం ఉంది. డీల‌ర్ మ‌ర‌ణించిన త‌ర్వాత డీల‌ర్ షిప్ కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే.. రెండేళ్ల‌కు ఈ నిబంధ‌న‌తో సంబంధం లేకుండా డీల‌ర్ షిప్ కేటాయిస్తారు.

Leave A Reply

Your email address will not be published.