నాన్న కోలుకోవాల‌ని ప్రార్థించండి: శివాత్మికా రాజశేఖర్

హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర‌మంత్రులు, ప‌లు రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనీ ప్ర‌ముఖులు ఇలా ఎంద‌రో క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు కూడా క‌రోనా సోకింది. ఇటీవ‌ల‌ హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి విధిత‌మే. రాజ‌శేఖ‌ర్ కుటుంబంలో మిగిలిన వారు త్వరగానే కోలుకున్నప్పటికీ రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంద‌ని స‌మాచారం. ఈ విషయాన్ని ఆయన కూతురు శివాత్మిక ట్విటర్ ద్వారా తెలియజేసింది. `కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. అభిమానుల ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం అనుకంటున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని దయచేసి ప్రార్థనలు చేయండి. మీ అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు` అని శివాత్మిక పోస్టులో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.