ఎన్నిక‌ల్లో పోటీకి వైఎస్ఆర్‌టిపి దూరం: వైఎస్ ష‌ర్మిల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): వైఎస్ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు వైఎస్ ఆర్ టిపి పోటీ చేయ‌డం లేద‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు షర్మిల మీడియా స‌మావేసంలో మాట్లాడారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశ‌ముంద‌ని.. ఆపార్టీని దెబ్బ‌తీయాల‌నే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని ష‌ర్మిల అన్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారే అవ‌కాశం వ‌చ్చిన‌పుడు దానికి అడ్డుప‌డ‌టం స‌రికాద‌ని .. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

 

నేటి నుండి శాస‌న‌స‌భ‌ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు షురూ..

Leave A Reply

Your email address will not be published.