BJP: మహిళలకు రూ. 12 వేలు.. రూ. 500 గ్యాస్ సిలిండర్..
ఛత్తీస్‌గఢ్: బిజెపి మేనిఫెస్టో విడుదల..
రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి 20 హామీలతో కూడిన మేనిఫెస్టోని కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు తమదైన శైలిలో హామీల వర్షం కురుపిస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పెళ్లయిన మహిళలకు ఏడాదికి రూ. 12 వేలు ఆర్థిక సాయం.. రూ. 500 కే గ్యాస్ సిలెండర్.. మొత్తం 20 హామీలతో రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఓటర్లకు హామీ ఇచ్చారు.