వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా..
మంగళగిరి వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఆర్కే పదవికి రాజీనామా..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వైఎస్ ఆర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదివికి రాజీనామా చేశారు. అంతేకాకుండా వైఎస్ ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి లేఖను అందజేశారు.రాజీనామా చేసిన అంనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామాకు గల కారణాలు త్వరలో తెలియజేస్తానన్నారు. వైఎస్ ఆర్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన ఆర్కే రాజీనామ చేసినట్లు సమాచారం.