కెసిఆర్‌ను ప‌రామ‌ర్శించిన టిడిపి అధినేత చంద్ర‌బాబు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మాజి సిఎం కెసిఆర్‌ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అక్క‌డి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న త్వర‌గా కోలుకోవాల‌ని, ప్ర‌జా సేవ‌కు రావాల‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు. ఆస్ప‌త్రి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు.. కెసిఆర్ త్వ‌ర‌గా కోలుకుంటార‌ని, ఆయ‌న‌తో మాట్లాడాల‌నిపించి వ‌చ్చాన‌న్నారు. ఆయ‌న కోలుకోవ‌డానికి ఆరువారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు తెలిపార‌న్నారు. య‌శోద ఆస్ప‌త్రిలో మాజి సిఎం కెసిఆర్‌కు తుండి మార్పిడి స‌ర్జ‌రీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప‌లువురు నేత‌లు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు ఆస్ప‌త్రికి వ‌స్తున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆస్ప‌త్రిలో కెసిఆర్‌ను ప‌రామ‌ర్శించారు. బిఎస్‌పి నేత ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా కెసిఆర్‌ను ప‌రామ‌ర్శించారు.

Leave A Reply

Your email address will not be published.