నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీరు సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటనలో తెలియజేశారు. మంచినీరు సరఫరా చేసే పైపులైన్‌కు మరమ్మతులు చేయడం వలన పలు ఆయా ప్రాంతాల్లో బుధవారం ఉదయం 5 గంటల నుండి గురువారం ఉదయం 5 గంటల వరకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు 24 గంటలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తి అంతరాయం ఏర్పడు ప్రాంతాలు
శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట్, ఆళ్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్.
పాక్షికంగా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్
సైనిక్ పురి, మౌలాలి, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్
గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమా నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధం గూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, మానిక్ చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదీగూడ, ధర్మసాయి.