SA vs IND: 8 వికెట్ల తేడాతో సఫారీలపై భారత్ విజయం..
SF vs IND (CLiC2NEWS): దక్షిణాఫ్రికాతో ఆడనున్న మూడు వన్డేల సిరీస్లో భారత్ తొలి వన్డేలో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా జట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.