టి.వేదాంత సూరి: సరదాగా దసరా

నేను తొలిసారిగా దసరాకు విదేశాల్లో వుండే అవకాశం వచ్చింది. ఇక్కడ జమ్మి తెచ్చుకోవడం, పాలపిట్ట, గరుత్మంతుడిని చూడటం, గుడికి వెళ్లడం వంటివి వుండవు కాబట్టి అందరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం ఈ మేరకు ఇంట్లోనే వంటలన్నీ చేసుకుని ఇంటికి 66 కిలోమీటర్ల దూరం లో గంట ప్రయాణం రెండు కార్ లలో షేక్స్పియర్ పార్క్ కు బయలు దేరాం. పక్కనే బీచ్ ఉండటం మరో విశేషం. సాధారణంగా పిక్నిక్ వెళ్లడం, అంటే వనభోజనాలకు వెళ్లిన అనుభూతి కలిగింది. అక్కడికి చాలా మంది విదేశీయులు కూడా వచ్చారు. అక్కడే వంటలు చేసుకుని ఆది, పాడి ఆనందించి వెళ్లేవారు కూడా చాలా మంది వస్తారు.. పిల్లలు పెద్దలు సముద్ర నీటిలో అలల నడుమ ఆటలాడి, ఒడ్డు పైన వుండే చెట్ల కింద చాపలు వేసుకుని భోజనం చేసి పిల్లలు తనివి తీరా ఆడుకున్నాక మళ్ళీ సాయంకాలం వరకు ఇంటికి చేరుకున్నాం, ఇలా దసరా మాకు సరదాగా గడిచింది.

 

bento4d

Leave A Reply

Your email address will not be published.