లోక్‌స‌భ‌లో తాత్కాలిక బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర ఆర్ధిక‌మంత్రి

ఢిల్లీ (CLiC2NEWS): లోక్‌స‌భ‌లో గురువారం కేంద్ర‌ ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాత్కాలిక బ‌డ్జెట్ 2024ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్ల‌లో భార‌త్ అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించ‌బోతుంద‌న్నారు. సుస్థిర‌మైన అభివృద్ధే ల‌క్ష్యంగా ఆర్దిక విధానాలు ఉంటాయ‌ని.. భార‌త్‌కు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన డెమెక్ర‌సి, డెమెగ్ర‌ఫి, డైవ‌ర్సిటి త్ర‌యానికి దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను సాకారం చేసే స‌త్తా ఉంద‌న్నారు. 2047 నాటికి భార‌త్‌ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని.. గ‌త ప‌దేళ్ల‌లో 25 కోట్ల మందిని పేద‌రికం నుండి బయ‌ట‌కు తీసుకువ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు.

పిఎం ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద రాబోయే ఐదేళ్లో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆర్ధిక మంత్రి వెల్ల‌డించారు. కోటి ఇళ్ల‌కు రూఫ్‌టాప్ సోలారైజేష‌ణ్ స్కీమ్ కూడా ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు.
అంతే కాకుండా విద్యుత్ బిల్లుల నుండి సామాన్య ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించేలా బ‌డ్జెట్ లో నూత‌న ప‌థ‌కాన్ని మంత్రి ప్ర‌క‌టించారు. దేశ‌వ్యాప్తంగా కోటి ఇళ్ల‌కు నెల‌కు 300 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్ స్కీమ్‌ను తీసుకురానున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.