విదేశాల్లో చ‌దువుకొనే విద్యార్థుల కోసం ప్ర‌త్యేక హెల్ప్‌లైన్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది. విదేశాల్లో చ‌దువుకొనే విద్యార్థుల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజ‌ల‌కు ఈ భూమి మీద ఎక్క‌డ ఉన్నా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

చికాగోలో న‌గ‌రానికి చెంద‌ని విద్యార్థి స‌య్య‌ద్ మ‌జాహిర్‌పై మంగ‌ళ‌వారం దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. స‌య్య‌ద్ మ‌జాహిర్‌పై దాడి, ఒహియోలో శ్రేయాస్ రెడ్డి హ‌త్య క‌ల‌వ‌ర పెడుతున్నాయ‌ని సిఎం ట్వీట్ చేశారు. త‌మ ఆందోళ‌న‌ను అమెరికాకు తెల‌పాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్‌ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.