రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ సహా ముగ్గురు మృతి
మహబూబ్నగర్ (CLiC2NEWS): హైదరాబాద్ నుండి అనంతపురం వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టి ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పుర్ మండలం అన్న సాగర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్ ఐ వెంకటరమణ సహా ఆయన అల్లుడు, డ్రైవర్ మృతి చెందారు. కూతురు అనూష తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంకటరమణ కూతురు అనూష, పవన్సాయిల వివాహం ఈ నెల 15వ తేదీన జరిగింది. పెళ్లయిన వారం రోజులకే మామ,అల్లుడు మృతి చెందడంతో ఇరుకుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.