తెలంగాణ నూతన గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సిపి రాధాకృష్ణన్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. బుధవారం ఉదయం 11.15 గంటలకు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించానున్నారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు.