SEBI : 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
SEBI : సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్టు ఆఫ్ ఇండియా () 97 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి లోని పలు విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఎ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 13 నుండి స్వీకరిస్తారు. ధరఖాస్తు రుసుం రూ. 1000.. కాగా ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఎస్‌టి, ఎస్‌సి, ఒబిసి, దివ్యాంగులకు ఉచితంగా ఎగ్జామ్ ట్రైనింగ్ అందిచనున్నారు. దీనికోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకొనే సమయంలో ఆప్షన్ సెలక్టు చేసుకోవాల్సి ఉంటుంది.
జనరల్, లీగల్, ఐటి, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, రీసెర్ఛ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కేటగిరీల్లో 97 పోస్టులు ఉన్నాయి. వీటిలో జనరల్ 62, ఐటిలో 24, లీగల్ విభాగంలో 5, ఇంజినీరింగ్ , రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ కేటగిరీల్లో రెండు చొప్పున పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, పిజి పూర్తి చేసి ఉండాలి, ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు దాదాపు రూ. 1,49,500 అందుతుంది.