Kakinada: జంట హత్యల కలకలం
కాకినాడ (CLiC2NEWS): జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మిపురం పంట పొలాల్లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడిచేసి హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను, పెండ్యాల లోవమ్మ సహజీవనం చేస్తున్నారనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన నాగబాబు కత్తితో నరికి హత్య చేశాడు. లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలిని పోలీసు ఉన్నతాదికారులు పరిశీలించారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారున్నారు. నాగబాబుతో సహజీవనం చేసిన లోవమ్మ.. ఇటీవల శ్రీనుతో సహజీవనం చేస్తుందనే అనుమానంతో ఈ జంట హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.