ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో రెండు గంటలు నిలిచిపోయిన రెండు రైళ్లు
హైదరాబాద్ (CLiC2NEWS): హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయం 6.10 గంటలకు రెండు రైళ్లు నిలిచిపోయాయి. సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి సికింద్రాబాద్ వస్తున్న కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, ఆ తర్వాత వచ్చిఏన అహ్మదాబాద్ నుండి చెన్నై సెంట్రల్ వెళుతున్న నవజీన్ ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేశారు. నవజీన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌ను నవజీవన్‌కు మార్చారు. అనంతరం రాత్రి 8 గంటల తర్వాత రెండు రైళ్లు బయలుదేరాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు ట్రైన్‌లు నిలిచిపోవడంతో చిన్నపిల్లలు , వృద్దులు ఇబ్బందులు ఎదుర్కున్నట్లు తెలుస్తోంది.