భువనగిరి పెట్రోల్ బంక్‌లో పేలిన లారీ డీజిల్ ట్యాంకు..
భువనగిరి (CLiC2NEWS): పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో లారీ డీజిల్ ట్యాంకు పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. మంటలు గాల్లోకి పెద్గ ఎత్తున చెలరేగాయి. వెంటనే స్పందించిన పెట్రోల్ బంకు సిబ్బంది చాకచక్యంగా మంటలను ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. మంటలు అదుపులోకి రాకుంటే భారీ ఆస్థి,ప్రాణ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు.
