బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడిన తెలుగు టివి నటినటులు..
బెంగళూరు (CLiC2NEWS): ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో నిర్వహించిన బర్త్‌డే పార్టీలో తెలుగు టివి నటులు, మోడళ్లు పట్టుబడ్డారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు సమాచారం. బెంగళూరు శివారులో జరుగుతున్న రేవ్ పార్టీ గురించి తెలుసుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. ఈ పార్టికి దాదాపు 100 మందికిపైగా హాజరైనట్లు సమాచారం. ఈ పార్టికి వచ్చిన ఓ కారులో ఎపి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ దొరికింది.
ఫామ్‌హౌస్ పరిసరాల్లో జగ్వార్, బెంజ్ సహా ఖరీరైన 15 కార్లను జప్తు పోలీసులు జప్తు చేశారు. 17 గ్రాముల ఎండిఎంఎ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.