ఢిల్లీలోని బేబికేర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు మృతి
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని బేబికేర్ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరికి చికిత్సను అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్లో ఉన్న శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.