మ‌రికాసేప‌ట్లో ఐపిఎల్ సీజ‌న్ 17 ఫైన‌ల్ మ్యాచ్ ..

చెన్నై (CLiC2NEWS): మ‌రికాసేప‌ట్లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్‌, కోల‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య తుది పోరు జ‌ర‌గ‌నుంది. ఐపిఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో క‌ప్ గెలిచేదెవ‌రో మ‌రి కొన్ని గంట‌ల్లో తేల‌నుంది. చెన్నైలోని చెపాక్ వేదిక‌గా ఐపిఎల్ క‌ప్ కోసం ఇరు జ‌ట్లు పోటి ప‌డ‌నున్నాయి. ఒక వేల వాతావ‌ర‌ణం అనుకూలించ‌క మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే రిజ‌ర్వ్‌డే ఉంది. ఈ మ్యాచ్‌ను సోమ‌వారం కూడా కొన‌సాగించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఒక వేళ రేపుకూడా వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్ద‌యితే కోల్‌క‌తా ను టైటిల్ విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. ఎందుకంటే లీగ్ స్టేజ్‌ను కోల్‌క‌తా 20 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిల‌వ‌డ‌మే. హైద‌రాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.