కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు కేంద్ర మంత్రులు, రాష్ర్టాల మంత్రులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారు వెంటనే కరోనా ప‌రీక్ష‌లు నిర్వహించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. “ఓ ప్రకటన చేస్తున్నప్పుడు పదాల కోసం శోధించడం నాకు చాలా అరుదు; అందుకే నేను దీన్ని సరళంగా చెబుతున్నా.. నాకు పాజిటివ్ అని తేలింది. నాతో ట‌చ్‌లో ఉన్నవారు త్వరగా పరీక్షించుకోమ‌ని విజ్ఞ‌ప్తి చేసు్త‌న్నా..“ అని ట్వీట్ చేశారు

Leave A Reply

Your email address will not be published.