తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1,504 కరోనా కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 2,35,656కి చేరగా.. 1,324 మంది మరణించారు. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ఉదయం ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17,979 యాక్టివ్‌ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 2.16 లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో 288, మేడ్చల్‌ 118, రంగారెడ్డిలో 115 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య 41,96,958 కి చేరింది.

1 Comment
  1. […] తెలంగాణలో కొత్తగా 1,504 కరోనా కేసులు […]

Leave A Reply

Your email address will not be published.