`ధరణి` పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సేవలలో నూతన శకం ప్రారంభమైంది. టిఆర్ ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

తప్పక చదవండి: దేశానికే `ధరణి` ఆదర్శకంగా నిలుస్తుంది: మంత్రి కెటిఆర్