శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ రూ. 67 లక్షల విదేశీ కరెన్సీ
హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. రూ. 67 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ప్రయాణికుడు వద్ద కరెన్సీని గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా కరెన్సీని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తరలించే ప్రయత్నం చేశాడు. దానిలోదాచిన అమెరికన్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.