వరద బాధితులకు రూ.6కోట్ల సాయం: పవన్‌కల్యాణ్
అమరావతి (CLiC2NEWS): వరదలు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్ ప్రజలను ఆదుకోవడానికి ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఎపి, తెలంగాణ సిఎం సహాయ నిధికి రూ.1కోటి చొప్పున .. ఎపిలోని 400 పంచాయతీలకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
బుడమేరులోని 90శాతం ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని పవన్ కల్యాణ్ అన్నారు. విపత్తు సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సిఎం చంద్రబాబు సమర్ధంగా పనిచేస్తున్నారని, ఈ వయసులోనూ జెసిబిలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని కొనియాడారు. ఆయనను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం పరికాదని వైఎస్ ఆర్‌సిపి నేతలను ఉద్దేశించి హితవు పలికారు. విమర్శలు చేసే వారు ముందు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని .. ఆతర్వాత ఆరోపణలు చేయాలన్నారు. వరద ప్రభావం లేని జిల్లాల నుండి వచ్చిన 900 మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ అర్బన్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. 26 ఎన్‌డిఆర్ ఎఫ్, నేవి నంఉడి 2 ఎయిర్ ఫోర్స్ నుండి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందిన పవన్ తెలిపారు.