ఢిల్లీలో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు!
ఉల్లంఘించిన వారికి రూ.50 వేల వరకు జరిమాన
ఢిల్లీలో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు!
ఉల్లంఘించిన వారికి రూ.50 వేల వరకు జరిమాన

న్యూఢిల్లీ : దేశంలో వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది. గడిచిన 24 గంటలో్ల మరో 944 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరితో ఆదివారం నాటికి దేశంలో కరోనా కాటుకు బలైనవారు 49,980కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక పాజిటీవ్ కేసులు రోజురోజుకు మరింతగా పెరుగుతండడం ప్రజలను భయ్రభాంతులకు గురిచేస్తోంది. గడిచిన వారం రోజులుగా 60వేలకు పైగా తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,489 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25, 89,682గా ఉంది.
ఈ నేపథ్యంలో రానున్న గణేశ్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఈ కోవిడ్ వైరస్ మహమ్మారి ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జాతీయ రాజధానిలోని గణేష్ చతుర్థిపై బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సమ్మేళనాలు, సమూహ వేడుకలు లేదా విగ్రహ నిమజ్జనం చేయరాదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ పేర్కొంది. ఎవరైన ఈ నిషేధాజ్ఞలు ఉల్లంగిస్తే వారికి రూ. 50 వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది.