రాష్ట్రంలో టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది.టెట్ ప‌రీక్ష‌ ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హిస్తామ‌ని గ‌తంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది మే 20 నుండి జూన్ 2 వ‌ర‌కు ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రెండో టెట్‌కు న‌వంబ‌ర్‌లో నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. తాజాగా సోమ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నెల 5 నుండి 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. 2025 జ‌న‌వ‌రి 1 నుండి 20 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.