హ‌య‌త్‌న‌గ‌ర్‌లో స్కూల్ గేటు మీద ప‌డి విద్యార్థి మృతి

హ‌య‌త్‌న‌గ‌ర్‌ (CLiC2NEWS): పాఠ‌శాల గేటు విరిగి మీద ప‌డి ఓ విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న హ‌య‌త్‌న‌గ‌ర్‌లో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్‌లో గేటు మీద ప‌డి ఒక‌ట‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి గేటుతో ఆడుకుంటుండ‌గా.. మ‌రి కొంద‌రు గేటు ఎక్కి అటూ ఇటూ ఊగుతున్నారు. ఈ స‌మ‌యంలో గేటు వెల్డింగ్ జాయింట్లు ఊడిపోయి బాలుడిపై ప‌డిపోయింది. విద్యార్థి త‌ల‌కు తీవ్ర గాయం కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చిన్నారిని ప‌రీక్షించిన వైద్యులు .. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.