ద్రౌప‌ది ముర్మును రాష్ట్రప‌తిని చేయ‌డం ఎన్‌డిఎ అదృష్టం: ప్ర‌ధాని మోడీ

ప‌ట్నా (CLiC2NEWS): గ‌త ప్ర‌భుత్వాలు వెన‌క‌బ‌డిన వ‌ర్గాల సంక్షేమం గురించి ప‌ట్టించుకోలేద‌ని .. వారి అభివృద్ధి గురించి ఎన్న‌డూ కృషి చేయ‌లేద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విమ‌ర్శించారు. బిహార్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం ఓ ఆదివాసి మ‌హిళ‌కు దేశ అత్యున్న‌త రాష్ట్రప‌తి ప‌దివినిచ్చి గౌర‌వించింద‌ని, ద్రౌప‌ది ముర్మును రాష్ట్రప‌తిని చేయ‌డం ఎన్‌డిఎ అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఆమె పేరును ప్ర‌తిపాదించ‌గానే.. బిహార్ సిఎం ద్రౌప‌ది ముర్మును గెలిపించాల‌ని దేశ‌వ్యాప్తంగా పిలుపునిచ్చార‌ని గుర్తుచేశారు. పిఎం జ‌న్‌మ‌న్ యోజ‌న ప‌థ‌కం ద్వారా రూ.24వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. ఈ ప‌థ‌కం ద్వారా ప‌నుల ప్రారంభ ఘ‌న‌త రాష్ట్రప‌తిదే అని కొనియాడారు.

 

Leave A Reply

Your email address will not be published.