తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు సిఎం శంకుస్థాపన

ఏలూరు: ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో బుధవారం పర్యటించారు. జిల్లాలో తమ్మిలేరు రిటైనింగ్‌ వాల్‌కు సిఎం శంకుస్థాపన చేశారు. ఏలూరులో రూ.355 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం వీవీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా కళ్యాణమండపానికి చేరుకొని మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరారు. ఈ పర్యటనలో సిఎం జగన్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపి లు కోటగిరి శ్రీధర్‌, మార్గని భరత్‌, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్‌, తెల్లం బాలరాజు ఉన్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏలూరులో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేడియం వద్ద పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.

Leave A Reply

Your email address will not be published.