ఎపి రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’.. హాజరైన సిఎం, డిప్యూటి సిఎం
విజయవాడ (CLiC2NEWS): రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆదివారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ , రాష్ట్ర మంత్రులు, నారా లోకేశ్, నారాయణ అచ్చెన్నాయుడు, పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తదితరులు, డిప్యూటి స్పీకర్, రఘురామ కృష్ణరాజు, ఎంపిలు, ఎమ్మెల్యేలు మరి కొంత మంది అధికారులు , ప్రముఖులు హాజరయ్యారు.