సైనికుల సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌గా వారి పిల్ల‌ల‌కు స్కాల‌ర్‌షిప్‌లు: మంచు విష్ణు

హైద‌రాబాద్ (CLiC2NEWS):  దేశం కోసం ప‌నిచేసే తెలుగు సైనికుల త్యాగాల‌కు, వారి సేవ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌గా వారి పిల్ల‌ల‌కు స్కాల‌ర్ షిప్‌లు అంద‌జేయాల‌ని మంచు విష్ణు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం ఇత‌ర విద్యా సంస్థ‌లకు స్ఫూర్తి నిస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు మోహ‌న్‌బాబు విశ్వ‌విద్యాల‌యం ప్రొ.ఛాన్స్‌ల‌ర్ విష్ణు తెలిపారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాల్లో ప‌నిచేసే తెలుగు సైనిక కుటుంబాల పిల్ల‌ల‌కు చేయుత‌గా నిల‌వాల‌ని .. దేశంలో ఉన్న అన్ని తెలుగు కుటుంబాల పిల్ల‌ల‌కు స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.