పాక్ విమానాలకు గగనతలం నిషేధం పొడిగింపు..
ఢిల్లీ (CLiC2NEWS): భారత్-పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో పాక్ విమానాలకు భారత గగనతల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు తేదీ నేటితో ముగియనుండటంతో నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.జూన్ 23 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని సమాచారం. దీని ప్రకారం పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలతో పాలు, ఆ దేశ సైనిక విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి వీల్లేదు.
గురువారం పాకిస్థాన్ .. భారత్ విమానాలపై విధించిన నిషేధాన్ని పొడిగించిన నేపథ్యంలో భారత్ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ విమానాలు తమ గగనతలం వినియోగించకుండా ఏప్రిల్ 23న పాకిస్తాన్ నిషేధం విధించింది. వారం రోజుల తర్వాత భారత్ కూడా పాక్ విమానాలపై నిషేధం విధించింది.