ఆర్‌సిబి విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట.. 11 మంది మృతి
బెంగళూరు (CLiC2NEWS):ఐపిఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్‌ను సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్‌తో బెంగుళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో విషాదం చోటుచోసుకుంది. ఈ కార్యక్రమానికి స్టేడియం వద్దకు వేలాది మంది అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. దీంతో ఆర్‌సిబి క్రీడాకారుల సన్మాన కార్యక్రమాన్ని నిలిపివేశారు.
18ఏళ్ల నిరీక్షణకు ఫలితంగా ఆర్‌సిబి జట్టు తొలి టైటిల్ సాధించింది. దీంతో ఆ రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సిబి జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. తమ అభిమాన క్రికెటర్‌లను చూసేందుకు తరలివచ్చిన అభిమానులతో చిన్నస్వామి స్టేడియం కిక్కిరిసిపోయింది. దీంతో గేట్లు, సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి రాగా.. గేట్-2 నుండి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.