‘ఓజాస్ తేజో’ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ (CLiC2NEWS): ‘ఓజస్ తేజో యోగా’ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డిడి కాలనీ లైబ్రరీ హాల్లో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ (21జూన్) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో కాలనీ వాసులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యెగాసనాలను ప్రదర్శించారు. డిడి కాలనీ లైబ్రరీ హాల్ మొత్తం యోగా సాధకులతో నిండిపోయింది.
ఈ సందర్భంగా ‘ఓజాస్ తేజో యోగా’ ఇనిస్టిట్యూట్ నిర్వహకురాలు, యోగా గురువు వర్ష దేశ్పాండే మాట్లాడుతూ.. అందరికి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యోగా యెక్క విశిష్టతను, తమ దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక, మానసిక, ఆరోగ్యంపై చూపే సానుకూల ప్రభావాన్ని నొక్కి చెప్పారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి రోజులో కొంత సమయం కేటాయించాలని తెలిపారు. ప్రస్తుత నగరజీవనంలో మహిళలందరికీ రోజువారీ యోగా సాధన ఆవశ్యకతను వివరించారు. అనంతరం పలు యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు.
అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ.. రోజువారీ యోగా చేయడంలో వారి అనుభవాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యోగా విద్యార్థులతో పాటు పలువురు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా `ఓజస్ తేజో యోగా ఇన్స్టిట్యూట్` నిర్వాహకులు వర్ష దేశ్పాండేకి శాలువా కప్పి సత్కరించారు.



