ఐఎస్ఎస్లో ప్రవేశించిన శుభాంశు శుక్లా..
Shubhanshu Shukla: అమెరికాలోని కెన్నడి అంతరిక్ష కేంద్ర నుండి బయలుదేరిన స్పేస్‌క్రాప్ట్ గురువారం సాయంత్రం ఐఎస్ ఎస్‌కు చేరుకుంది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఫాల్కన్-9 రాకెట్ ద్వారా భారత్‌కు చెందిన శుభాంశు శుక్లా, పెగ్ఈ విట్సన్ అమెరికా, స్లావోస్టజ్ ఉజ్నాన్స్కి – విస్నీవ్స్కి పోలండ్, టిబర్ కపు హంగరీ లు బుధవారం మధ్యాహ్నం అంతరిక్షంలోకి వెళ్లారు. అది గురువారం సాయంత్రం 4గంటలకు డాకింగ్ ప్రక్రియ పూర్తియింది. వీరంతా 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉండనున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ.. భారతీయులకు చిన్న సందేశం అంటూ.. అంతరిక్షంలోకి వెళ్లిన 634 వ్యోమగామినని.. ఇక్కడకు రావడం గర్వంగా ఉందన్నారు. అంతరిక్ష కేంద్రం నుండి భూమిని చూసే అవకాశం లభించిన కొద్దిమందిలో తాను ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కన్నారు. ఇదంతా మీ ప్రేమ , ఆశీస్సుల వల్లే సాధ్యపడిందన్నారు. ఈ ప్రయాణంలో ఇది తొలిమెట్టు అని.. రానున్న రోజుల్లో శాస్త్రీయ పరిశోధనలు చేపడతామన్నారు. తన భుజంపై భారత పతాకాన్ని గర్వంతో ధరించానని.. తన ప్రయాణంతో భారతీయులంతా ఉత్సాహంగా ఉన్నరిని భవిస్తున్నట్లు పేర్కొన్నారు.