పసుపు రైతుల కల నెరవేరింది: కేంద్ర మంత్రి అమిత్ షా
నిజామాబాద్ (CLiC2NEWS): కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో ఏర్పాటు చేసిన పసుపుబోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నలభై ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని.. నా చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధానిలాంటిది అని అమిత్ షా అన్నారు.
తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పసుపు బోర్డు కోసం బిజెపి ఎంపిలు ఎంతో పోరాడారని.. దీంతో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా దానికి ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తినే నియమించామని తెలిపారు. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్దతులపై శిక్షణ కల్పిస్తామన్నారు. 2030 నాటికి ఒక బిలియన్ డాలర్ విలువైన పసుపును మనం ఎగుమతి చేయాలని అన్నారు.