ఇక సామాన్యులు కూడా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ..

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిగ్ బాస్ సీజ‌న్‌-9 ప్రారంభం కాబోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సీజ‌న్‌లు పూర్తి చేసుకుని 9 వ సీజ‌న్లోకి అడుగుపెట్ట‌బోతుంది. అత్యంత ఆద‌ర‌ణ పొందిన ఈ రియాలిటి షోలో ఇప్ప‌టి వ‌ర‌కు సెల‌బ్రిటీలు మాత్ర‌మే పాల్గొనే వారు. ఈ సీజ‌న్‌లో కేవ‌లం సెల‌బ్రిటీలే కాకుండా సామాన్య ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. సామాన్యులు కూడా బిగ్‌బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. దీంతో ఈ బుల్లితెర షోపై మ‌రింత ఆస‌క్తి పెర‌గ‌నుంది. సీజ‌న్ -9కి కూడా నాగార్జున వ్యాఖ్యాత‌గా రానున్నారు. ఈ సీజ‌న్ చ‌ద‌రంగం కాదు.. ఈసారి ర‌ణ‌రంగం అనే ట్యాగ్‌లైన్ జోడించ‌డంతో షోపై అంచనాలు పెరిగాయి.

ఇన్నాళ్లుగా మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ఆద‌రించారు. ఇంత ప్రేమ‌ను పంచిన మీకు బ‌దులుగా ఎలాంటి కానుక ఇవ్వాలి.. మీరు ఎంత‌గానో ఇష్ట‌ప‌డే బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశ‌మే మీకు మేమిచ్చే రిట‌ర్న్ గిప్ట్ అన్నారు. సెల‌బ్రిటీల‌తో పాటు మీఓ ఒకరికి చోటు ఉంటుంది. బిగ్‌బాస్ త‌లుపులు మీకోసం తెరిచే ఉన్నాయి.. వ‌చ్చేయండి అంటూ ఇటీవ‌ల‌ చేసిన నాగార్జున ప్రోమోతో ఆహ్వానం ప‌లికారు.

సీజ‌న్ -9 లో పార్టిసిపేట్ చెయ్యాలంటే .. bb9.jiostar.com వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ అవ్వాలి. బిగ్‌బాస్ 9లో పార్టిసిపేట్ చేయ‌డానికి రీజ‌న్ చెబుతూ వీడియో అప్లోడ్ చేయాలి.

Leave A Reply

Your email address will not be published.