పాశ‌మైలారం ప్ర‌మాదంపై క‌మిటి ఏర్పాటు: సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): పాశ‌మైలారం పారిశ్రామిక వాడ‌లో భారీ పేలుడు సంభ‌వించిన సంగ‌తి తెలిందే. ఈ ప్ర‌మాదంలో 12 మంది దుర్మ‌ర‌ణం చెందారు . ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామాకృష్ణారావు నేతృత్వంలో స‌హాయ‌క చ‌ర్య‌ల ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటి ఏర్పాటు చేశారు.

పాశ‌మైలారం ప్ర‌మాద ఘ‌ట‌న‌లో దాదాపు 30 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. వారికి ఆస్ప‌త్రుల‌లో చికిత్సనందిస్తున్నారు. ప్ర‌మాధ స్థ‌లంలో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సిఎం ఎప్ప‌టిక‌ప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సిఎం అధికారులకు సూచించారు. రేపు ఘ‌ట‌నాస్థ‌లానికి సిఎం వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌మాద స్థ‌లంలో ప‌రిశ్ర‌మ లోప‌లికి వెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ‌లో 108 మంది కార్మికులు ఉన్నాట్లు స‌మాచారం. త‌మ‌వారి ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవ‌డంంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసుల‌కు , కార్మికుల కుటుంబ‌స‌భ్యుల‌కు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.