పోలీసుల‌ను కారుతో ఢీకొట్టి పరారైన దొంగ‌.. 

 

అమ‌రావ‌తి (CLiC2NEWS): పోలీసుల‌ను కారుతో ఢీకొట్టి  ప‌రార‌య్యాడు ఓ దొంగ‌. గాయ‌ప‌డిన కానిస్టేబుల్‌ చికిత్స పొంద‌తున్నారు. ఈ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లా అమ‌రావ‌తి మండ‌లం మునుగోడులో చోటుచేసుకుంది. ఓ కేసు విచార‌ణ కోసం పోలీసులు మునుగోడు వెళ్ల‌గా..  ప‌లు చోరీ కేసుల్లో నిందితుయిన వెంక‌ట్రావు పోలీసుల‌నుండి త‌ప్పించుకునే క్ర‌మంలో కారులో ప‌రార‌య్యేందుకు య‌త్నించాడు. అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన  కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు. దీంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాల‌వ్వ‌గా.. మ‌రొక‌రు త‌ప్పించుకున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.