బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ మోసం.. నలుగురు అరెస్ట్
కర్నూలు (CLiC2NEWS): బంగారం ధర రోజురోజుకీ పెరుతున్న నేపథ్యంలో అనేక మోసీలు చోటుచేసుకుంటున్నాయి. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని ఒకరి వద్ద నుండి ఏకంగా రూ.7 కోట్ల మేర మోసం చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి నుండి నలుగురు నిందితులు తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ.. రూ. 7.32 కోట్టు వసూలు చేశారు. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్నూలు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. నిందితులు పోలీసుల పేరుతో కూడా మోసాలు చేస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుండి రూ.6.40లక్షల నగదు, 4కార్లు, నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.