స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్.. 1340 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు

SSC: స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (SSC) కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 1340 జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నుంది. సివిల్, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ విభాగాల్లో ఈ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌లు బిఆర్ఒ, సిడ‌బ్ల్యుసి, సిపిడ‌బ్ల్యుడి, ఎంఇఎస్‌, ఎన్‌టిఆర్ఒ, జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌ల్లో గ్రూప్‌-బి (నాన్ – గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియ‌ల్ ) స్థాయిలో జూనియ‌ర్ ఇంజినీర్ ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు జులై 21వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 27 నుండి 31 వ‌ర‌కు పేప‌ర్ -1 ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. జ‌న‌వ‌రి నుండి ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య‌లో పేప‌ర్‌-2 జ‌రుగుతుంది.

జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్‌)

జూనియ‌ర్ ఇంజినీర్ (మెకానిక‌ల్‌)

జూనియ‌ర్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌)

జూనియ‌ర్ ఇంజినీర్ (ఎల‌క్ట్ర్రిక‌ల్&మెకానికల్‌)

సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ప‌నిఅనుభ‌వం కూడా ఉండాలి.

01.01.2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సిపిడ‌బ్ల్యుడికి చెందిన పోస్టుల‌కు 32 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. ఎస్‌టి/ ఎస్‌సి అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు.. ఒబిసిల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్ల వ‌యోస‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

బిఆర్ ఒ పోస్టుల‌కు పురుష అభ్య‌ర్థులు మాత్ర‌మే అర్హులు.

ఎంపికైన వారికి రూ.35,400 నుండి రూ.1,12,400 వ‌ర‌కు వేత‌నం ల‌భిస్తుంది. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ద్వారా ఎంపిక జ‌రుగుతుంది.

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్షలు దేశ‌వ్యాప్తంగా 9 ఎస్ ఎస్‌సి ప్రాంతీయ కేంద్రాల ప‌రిధిలో ఉన్న న‌గ‌రాల్లో నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థులు మూడు కేంద్రాల‌ను ప్రాధాన్యత క్ర‌మంలో ఎంపిక చేయ‌వ‌చ్చు.

ప‌రీక్ష విధానం..
పేప‌ర్ -1 జ‌న‌ర‌ల్ ఇంటిలిజెన్స్‌, జ‌న‌ర‌ల్ అవేర్నెస్‌, జ‌న‌ర‌ల్ ఇంజినీరింగ్ (సివిల్/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌)

200 మార్కుల పేప‌ర్ ఉంటుంది.
ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి నెగెటివ్ మార్కింగ్‌ -0.25 మార్కులు ఉంటాయి.

పేప‌ర్ -2
జ‌న‌ర‌ల్ ఇంజినీరింగ్.. అభ్య‌ర్థి ఎంపిక చేసిన స్పెష‌లైజేష‌న్ ఆధారంగా ఉంటుంది. నెగెటివ్ మార్కులు -1 ఉంటుంది.

 

Leave A Reply

Your email address will not be published.