భార‌తీయులు ఎక్క‌డున్నా త‌గ్గేదేలే.. అందులో తెలుగోళ్లు అస్స‌లు త‌గ్గేదేలే: అల్లు అర్జున్‌

NATS-2025: అమెరికాలో జ‌రిగిన ‘నాట్స్ 2025’ కార్య‌క్ర‌మంలో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కులు రాఘ‌వేంద్ర‌రావు, సుకుమార్‌, న‌టి శ్రీ‌లీల పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాన‌న్నారు. ఇంత మంది తెలుగువారిని ఇక్క‌డ చూస్తుంటూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నాన‌న్నారు. ఇంత‌మందిని చూస్తుంటే హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నంలో ఉన్న‌ట్లు అనిపిస్తుంద‌న్నారు. విదేశాల్లో తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నార‌ని .. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నారా.. వైల్డ్ ఫైర్ అంటూ త‌న‌దైన స్టైల్‌లో డైలాగ్ చెప్పారు.

మ‌న తెలుగు క‌ల్చ‌ర్‌ను ముందు త‌రాల‌కు తీసుకు వెళుతున్నందుకు ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్‌ ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. న‌న్ను ఇలాంటి అద్భుత‌మైన కార్య‌క్ర‌మానికి ఆహ్వానించినందుకు నాట్స్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. నాట్స్ గురించి స‌ర‌దాగా పుష్ప స్టైల్ లో చెప్పాలంటే నాట్స్ అంటే నేష‌న‌ల్ అనుకుంటివా.. ఇంట‌ర్నేష‌న‌ల్. భార‌తీయులు ఎక్క‌డున్నా త్గేదేలే.. అందులోనూ తెలుగోళ్లు అస్సలు త‌గ్గేదేలే అని అల్లు అర్జున్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.